White wine

కోలాహలపు నిశ్శబ్దాల మధ్య
కోరకుండానే .. నా చెంత
చేరింది  white wine

ఒకరికొకరం పూర్తిగా
అపరిచితులుమే...

మొదటి కలయికలో
తనను తాను పరిచయం చేసుకుంటూ
మెత్తగా నా పెదవులను తాకి మెల్లగా
గొంతులోకి జాలువారుతూ
మనసంతా నిండుకుంది

మరో కలయికలో
వేల యేళ్ళ  క్రితం విడిపోయి ఇప్పుడే కలుసుకున్నట్టుగా తన వైపు అడుగు వేసి
తన పరిచయాన్ని అందుకుంటూ
నా పరిచయం మాటే మర్చిపోయాను

ఇప్పటికి ఇదే చివరి కలయిక
ఎవరు ఎవరితో అల్లుకున్నరో తెలియకుండా
తేనె తుట్టలోని మకరందంలా
నా అణువణువు పరిచయం చేసుకుంటూ
నాలోపల ఇంకిపోతూ .. అంతా తానై
తను చుక్క.. చుక్కగా ఖాళీ అవుతూ
నన్ను ప్రశ్నిస్తుంది నువ్వెక్కడ అని...

ఇంకేమీ వద్దు....
నన్ను నన్నుగా మిగలనివ్వకు
నీ  మిగులు ఖాళీతనములో
పూర్తిగా నన్ను వశపరుచుకో
హా..... ఎంత బాగుంటుందో

ఓహ్....
ఇంతకు నువ్వెప్పుడు
White wine  అయ్యావు....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!